Mane Praveen

Sep 24 2023, 19:17

గర్షగడ్డ: అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యే, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, సరంపేట గర్షగడ్డ గ్రామంలో బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునుగోడు నియోజకవర్గ  ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద రజిని సాయి చంద్, దలితబంధు జిల్లా డైరెక్టర్ లపంగి నరసింహ, మాల్ మార్కెట్ మాజీ చైర్మన్ దంటు జగన్, వైస్ ఎంపీపీ కట్కూరి వెంకటేష్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోటకూర శంకర్, గ్రామ సర్పంచ్ వెన్నేమల్ల వెంకటమ్మ మధుకర్, రైతుబంధు మండల కన్వీనర్ రామకృష్ణ, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు తాళ్లపల్లి రవి, జాతీయ అధికార ప్రతినిధి బెరే గురుపాదం, రాష్ట్ర అధ్యక్షుడు చిక్కుడు గుండాల, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాజుల పున్నమ్మ, మాల మహానాడు మండల అధ్యక్షుడు నాగిళ్ల మారయ్య తదితరులు పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించుకుంటున్నామని, అందులో భాగంగా బడుగు బలహీన వర్గాలకు అభ్యున్నతి తోడ్పడే విధంగా గురుకుల పాఠశాల, కళాశాలలను ఏర్పాటు చేసుకున్నామని, అందులో ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్ష 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఆసరా పెన్షన్, వికలాంగుల పెన్షన్, వృద్ధాప్య పెన్షన్లు అందజేస్తున్నామని, అంబేద్కర్ ఆశయాలు సాధించుకునే విధంగా అన్ని వర్గాలకు మేలు జరిగే పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు వెన్నేమల్ల నరసింహ, వెన్నమల్ల వెంకటేష్, మంచాల యాదగిరి, పోతురాజు ప్రకాష్, ఈసం కమలాకర్, గిరిసామెల్, మంచాల అంజయ్య, మంచాల సతీష్, ఇతర గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA

SB NEWS TELANGANA

Mane Praveen

Sep 24 2023, 11:46

TS: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం
కరీంనగర్ జిల్లా: ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొని నలుగురికి తీవ్ర గాయలైన ఘటన శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ శివారులోని ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 46 మంది ప్రయాణికులతో నిజామాబాద్ కు వెళ్తుంది. ఈ క్రమంలో బస్సు తాడికల్ శివారులోకి రాగానే కరీంనగర్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, మరో 16 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారందరినీ 108 వాహనంలో చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలిలంచారు. విషయం తెలుసుకున్న కేశవపట్నం ఎస్ఐ పాకాల లక్ష్మారెడ్డి ఘటనా స్థలానికి చేరుకు వివరాలను సేకరిస్తున్నారు... SB NEWS SB NEWS TELANGANA

STREETBUZZ APP

Mane Praveen

Sep 23 2023, 15:36

TS: గురుకుల పాఠశాలలో అగ్నిప్రమాదం

హైదరాబాద్: ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్ పేట్ గురుకుల పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వినాయక చతుర్థిని పురస్కరించుకుని హాస్టల్ గదిలో వినాయకుడి ని విద్యార్థులు ఏర్పాటు చేసుకున్నారు. రాత్రి పూజ లో భాగంగా విద్యార్థులు దీపం వెలిగించారు. దీపం ఆరిపోకుండా ఉడడం కోసం చుట్టూ దుప్పట్ల తో తెర ఏర్పాటు చేశారు. గాలికి దుప్పటి కి మంటలు అంటుకుని అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గదిలో దట్టమైన పొగ అలుముకోవడంతో విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలైనాయి. SB NEWS SB NEWS HYDERABAD SB NEWS TELANGANA

Mane Praveen

Sep 23 2023, 15:12

చౌటుప్పల్: అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు

YBD: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరియు నాగుల గుంట పక్కన ఉన్న శివాలయంలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ వెన్ రెడ్డి రాజు ముఖ్యఅతిథిగా పాల్గొని, ఆయన చేతుల మీదుగా భక్తులకు అన్నం వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కామిశేట్టి భాస్కర్, నాంపల్లి శ్రీనివాస్, కామిశెట్టి చంద్రశేఖర్, సోమారపు సత్తయ్య, కటకం ప్రశాంత్, నాంపల్లి రమేష్, జొర్రిగల వెంకటేష్ సరిత, సంధగళ్ల మల్లేష్, చిలువేరు శ్రీశైలం, వీరమల్ల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS YADADRI DIST SB NEWS TELANGANA

Mane Praveen

Sep 23 2023, 14:33

BC రాయ్ ట్రోపీ జాతీయ స్థాయి జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులు
 
నల్గొండ: ఈనెల 24 వ తేదీ నుండి అక్టోబర్ 8 తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్ లో జరిగే BC రాయ్ ట్రోఫీ జాతీయస్థాయి జూనియర్ బాలుర ఫుట్బాల్ పోటీలకు, ఉమ్మడి నల్గొండ జిల్లా పక్షాన మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామానికి చెందిన రాచూరి వెంకటసాయి మరియు పిఏ పల్లి మండలం కేశ్నేనిపల్లి గ్రామానికి చెందిన రమావత్ దినేష్ లు ఎంపికయ్యారని ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన రాచూరి వెంకట సాయి , రమావత్ దినేష్ లను అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, మరియు అసోసియేషన్ సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. గత 15 రోజుల నుండి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సెలక్షన్ల లో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా ఇద్దరు క్రీడాకారులను తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. రాచూరి వెంకటసాయి నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతూ, చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ (ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రెటరీ) మద్ది కరుణాకర్ సారథ్యంలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిరంతరం శిక్షణ పొందుతూ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు (ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు) దగ్గుపాటి విమల అందిస్తున్న సంపూర్ణ సహకారంతో జాతీయ స్థాయి పోటీలకు ఎన్నికైనాడని, మరియు రమావత్ దినేష్ చండూరు గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతూ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ఫుట్బాల్ అకాడమీ కోచ్ లింగయ్య నాయక్ సారధ్యంలో శిక్షణ పొందుతూ ఇద్దరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి నల్గొండ జిల్లా క్రీడాకారులలో ఉన్న సహజ ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారులకు మంచి క్రీడా భవిష్యత్తు ను అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి మరియు TFA ప్రధాన కార్యదర్శి GP ఫల్గుణకు మరియు వారి టీంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు వారు తెలిపారు. SB NEWS

SB NEWS NALGONDA

Mane Praveen

Sep 22 2023, 22:11

'అనుచిత వాక్యలు రాజబోడ పై చర్యలు తీసుకోవాలి'

చండూర్: బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నారై రాజ్ బోడ పై చర్యలు తీసుకోవాలని, బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం చండూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కి  పిటిషన్ అందజేశారు. బహుజన్ సమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు నేరెళ్ల ప్రభుదాస్, ఉపాధ్యక్షులు కడారి సైదులు యాదవ్, మునుగోడు నియోజకవర్గ కార్యదర్శి అన్నెపాక శంకర్, బి వి ఎఫ్ జిల్లా కన్వీనర్ సామ్రాట్ కిరణ్,  మున్సిపల్ అధ్యక్షులు బూసిపాక మాణిక్యం, తిప్పర్తి యాదయ్య, తదితరులు పాల్గొన్నారు SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA STREETBUZZ APP

Mane Praveen

Sep 22 2023, 20:42

నల్లగొండ: గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్

గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ఘనంగా నిర్వహించనున్న గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని, నల్లగొండ మున్సిపల్ కమిషనర్ కె.వి.రమణాచారి శుక్రవారం, నల్లగొండ పట్టణంలోని గణేష్ విగ్రహాల నిమజ్జన కేంద్రాలైన వల్లభరావు చెరువు మరియు భీమసముద్రంలను పరిశీలించి, నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA STREETBUZZ NEWS

Mane Praveen

Sep 22 2023, 18:39

NLG: మహిళా హక్కుల పరిరక్షణకై కదలిరావాలి, అక్టోబర్ 5న చలో ఢిల్లీ: పిలుపునిచ్చిన మల్లు లక్ష్మి

మహిళా హక్కుల పరిరక్షణకై అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) అక్టోబర్ 5 న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన దేశవ్యాప్త నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని, మహిళా లోకానికి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. శుక్రవారం నల్లగొండ పట్టణంలోని దొడ్డి కొమురయ్య భవన్ లో ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మహిళలపై ఆకృత్యాలు ఎక్కువ అయ్యాయని, మహిళా హక్కులు కాలరాయబడుతున్నాయని ఆరోపించారు. మహిళలపై రోజురోజుకు హింస, లైంగిక దాడులు, అత్యాచారాలు తీవ్రతరమైపోతున్నాయని భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటినా, మహిళల రక్షణకై మార్పు రాలేదన్నారు. పార్లమెంటు వేదికగా మహిళా రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందిస్తున్నా, ఆచరణలో ప్రభుత్వాలు సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. దేశంలో మహిళలపై ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా ప్రభుత్వాలు మేలుకొని ఒక చట్టాన్ని రూపొందించి వదిలేస్తున్నాయన్నారు. బేటి బచావో బేటి పడావో అని చెప్తున్న బిజెపి ప్రభుత్వం నేరగాళ్లకే కొమ్ముకాస్తుందని విమర్శించారు. అత్యాచారాలకు లైంగిక వేధింపులకు పాల్పడేవారిలో బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ లాంటి వారే అగ్రస్థానంలో ఉన్నారన్నారు. మహిళల పై జరుగుతున్న వివిధ రకాల దాడులను నివారించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మహిళా హక్కుల కోసం పోరాడుతున్న అతిపెద్ద మహిళా సంఘంగా ఐద్వా క్రియాశీలక పాత్ర పోషిస్తూ, మహిళల పట్ల జరుగుతున్న వివిధ సంఘటన పట్ల ఎప్పటికప్పుడు స్పందిస్తూ మహిళల ను రక్షించుకోవడం కోసం, మరిన్ని హక్కులను సాధించుకోవడం బలమైన ఉద్యమాలను నిర్మించింది అన్నారు. అందులో బాగంగానే అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున మహిళలను సమీకరించి నిర్వహిస్తున్నామని ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి మాట్లాడుతూ.. మహిళా స్వేచ్ఛా స్వాతంత్యాలను కాపాడడం కంటే వారి హక్కులను ఏలా కాలరాయాలో బిజెపి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మహిళలపై గౌరవం ఉంటే మణిపూర్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను బిజెపి ఎందుకు అరికట్టడం లేదో ఈ సమాజానికి స్పష్టం చేయాలన్నారు.

మహిళపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఐద్వా తలపెట్టిన అక్టోబర్ 5 న చలో ఢిల్లీ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా మహిళలు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పోలేబోయిన వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఐద్వా సహాయ కార్యదర్శి భూతం అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

Sep 22 2023, 17:29

మర్రిగూడెం: పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండల కేంద్రంలో  'యూత్ ఫర్ బెటర్ సొసైటీ' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిలివేరు రఘు, పగడాల రఘు, అంజి, శేఖర్, శంకర్, అభిసందేశ్, దశరథ్, పవన్, రమేష్, వెంకటేష్, కిషోర్, పాండు, శ్రీకాంత్, మారి, శ్రీశైలం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. SB NEWS SB NEWS NALGONDA SB NEWS TELANGANA

STREETBUZZ APP

Mane Praveen

Sep 22 2023, 12:54

TS: రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు

Telangana: రాష్ట్రంలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని చెప్పింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం ఆసిఫాబాద్ లో భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(టీ)లో 11.3 సెం.మీ వర్షపాతం కురిసింది.

ఆదిలాబాద్, నిర్మల్, కరీంనగర్, ములుగు, వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. SB NEWS

SB NEWS TELANGANA

STREETBUZZ APP